Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా, యలమంచిలి నియోజకవర్గం లో టీడీపీ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరావు ఆధ్వర్యంలో పార్టీ సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ సమావేశం లో నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా పోటీ చేయడానికి జనసేన పార్టీ కి టికెట్ కేటాయించారు అని తెలియడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి నిరసన తెలిపారు. నియోజకవర్గ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరావు, సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతి రావు పార్టీ కి రాజీనామా చెయ్యాలని టీడీపీ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎట్టి పరిస్థితిలో యలమంచిలి నియోజకవర్గం టికెట్ టీడీపీ కే కేటాయించాలి అని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Reporter
Rapid TV