Saturday, 13 June 2026 02:34:20 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

ఎన్టీఆర్ కి ఘనంగా నివాళులు అర్పించిన దాడి రత్నాకర్

Date : 18 January 2025 03:31 PM Views : 388

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ అనకాపల్లి:: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ స్వర్గీయ ఎన్ టి రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా శనివారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ గారు అనకాపల్లి పట్టణంలోని ఉన్న వివిధ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీ దాడి రత్నాకర్ గారు మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు గారి జీవితం ఎంతోమందికి ఆదర్శప్రాయమని ఆయన గురించి తెలియని తెలుగువాడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరని అన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రామునిగా, కృష్ణునిగా, పౌరాణిక, సాంఘిక చిత్రాలలో నటించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని అన్నారు. అంతేకాక 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజల కోసం కిలో రెండు రూపాయలకే బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్ కి చెందుతుందని అన్నారు. అనకాపల్లి ప్రాంతంలో మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్ర రావు గారి హయాంలో చేపట్టిన అనేక శాశ్వత నిర్మాణాలకు ఎన్టీఆర్ పేరును పెట్టడం జరిగిందని అవి ఇప్పటికి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటూ అనకాపల్లి అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాయని అన్నారు. వీటిలో ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్, ఎన్టీఆర్ వైద్యాలయం,ఎన్టీఆర్ స్టేడియం, ఎన్టీఆర్ రక్షిత మంచినీటి పథకాలు, వివిధ నదులపై నిర్మించిన వంతెనలు, పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించిన బి ఆర్ టి కాలనీ వంటి వాటితో ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించిందని అన్నారు. తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కోటికి పైగా సభ్యత్వాలు ఒక ప్రాంతీయ పార్టీకి రావడం దేశంలోనే ఒక ఘనత అని అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పట్టణంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు పంచుతూ

పేదలకు దుప్పట్లు పంచుతున్న దాడి రత్నాకర్

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :