Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి రావికమతం: మండల కేంద్రం రావికమతం జిల్లా పరిషత్ హై స్కూల్ లో శుక్రవారం స్కూల్ యూనిఫారాలు పుస్తకాలను స్థానిక సర్పంచ్ మంగా మొదినాయుడు, చైర్ మెన్ బూసాల అప్పారావు ల చేతుల మీదుగా విద్యార్థినీ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు తో విద్యార్థిని విద్యార్థులకు స్కూలు అభివృద్ధికి విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ఈ రోజు నెలకొల్పారని అన్నారు. ఒక ఇంట్లో చదువుకునే వారాందరికి కూడా ఈరోజు తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి ఉప ముఖ్యమంత్రి కొణేదల పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు స్థానిక చైర్మన్ మాట్లాడుతూ ఈరోజు పాఠశాలలో 360 మంది విద్యార్థులు విద్యార్థులకు స్కూల్ యూనిఫారాలు పుస్తకాలు అందజేయడం గరిగిందని, మండలాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు షైనింగ్ అవార్డు ఇవ్వడం కూడా హర్షణీయమని అన్నారు ఈ సందర్భంగా మండలంలోని అత్యధిక మార్కులు సాధించిన పాఠశాలగా రావిక మతం జడ్పీ హైస్కూలు రావడం పట్ల స్థానిక ఉపాధ్యాయులను సిబ్బందిని వక్తలు కొనియాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా మంచి మార్కులు ఉత్తీర్ణత రావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి వి శ్రీనివాస్ సీనియర్ అద్యాపకులు బంటు సత్యారావు మాస్టారు, సత్యన్నారాయణ తదితర ఉపాధ్యాయులు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Admin
Rapid TV