Rapid TV - Andhra Pradesh / Anakapally : రావికమతం రాపిడ్ న్యూస్ : మండలంలోని చీమలపాడు పంచాయతీ కళ్యాణపులోవ, జెడ్.జోగంపేట గిరిజన గ్రామాలలో కొత్తకోట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చోడవరం న్యాయమూర్తి బి. సూర్యకళ హాజరయ్యారు. వైద్య శిబిరంలో నర్సీపట్నం కొత్తకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది వైద్యులు హాజరై రోగులకు వైద్య సేవలు అందించారు. సుమారు 200 మంది గిరిజనులు ఉచితంగా వైద్య సేవలను పొందారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సూర్య కళ మాట్లాడుతూ గిరిజనులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ముఖ్యంగా మహిళలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని తెలిపారు అదే విధంగా న్యాయ సలహాలను పొందాలని చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు తదితరులు హాజరయ్యారు
Admin
Rapid TV