Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి అనకాపల్లి : పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఆర్యవైశ్య మహాసభ అనకాపల్లి జిల్లా వారి ఆధ్వర్యంలో గణపతి మట్టి విగ్రహాలు ఉచితముగా పంపిణీ చేశారు. 2000 గణపతి మట్టి విగ్రహాలు చిన్న వీధి రామాలయం వద్ద, కన్యకా పరమేశ్వరి ఆలయం జంక్షన్ వద్ద, అనకాపల్లి రాజా ఆప్టికల్స్ అండ్ కంటి ఆసుపత్రి వద్ద శనివారం విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ అనకాపల్లి జిల్లా ప్రెసిడెంట్ యలమర్తి నర్సింగరావు మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో గణపతి మట్టి విగ్రహాలు పంపిణీ చేశామని అన్నారు. వివిధ రకాల రంగులు వాడిన విగ్రహాలను నదులలో కలపడం వల్ల నదులలోని నీరు కలుషితమై నీటిలో ఉన్న ప్రాణులు ఉనికికే ప్రమాదం కలుగుతుందని, వ్యవసాయానికి ప్రమాదం కలుగుతుందని అన్నారు ఈ రంగుల వలన సమాజంలో కలుషితం పెరిగి ప్రజలకు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. మానవాళి ఆరోగ్యం, సుఖం కోసం రాబోయే తరాలు వారికి స్వచ్ఛమైన గాలి భూమి నీరు అందించాలని ఉద్దేశంతో వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేశామని అన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోయ కార్యదర్శి తమ్మన సుబ్రమణ్య గుప్త, కోశాధికారి గుండా రమేష్ గుప్త, పుట్టా మోహన్ రావు ( జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్), కొట్టాడ గణ ( మాడుగుల మండల ప్రెసిడెంట్), మీడియా చైర్మన్ పూసర్ల రాజా, జిల్లా హానరబుల్ అడ్వైసర్ నుదురుపాటి తాతాజీ, జిల్లా జాయింట్ సెక్రటరీ బండారు వీరవతారం, జిల్లా సేవాదళ్ జాయింట్ సెక్రటరీ ఉడా రమేష్, జిల్లా పి ఆర్ ఓ నేతి నాగ వెంకట వర ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ పోలిశెట్టి అయ్యప్ప, అనకాపల్లి మండల ఆర్య వైశ్య ప్రెసిడెంట్ అర్రెప్పు కాశన్న, సెక్రటరీ కొల్లూరు కిషోర్, మండల ఈ సి మెంబర్ నారాయణ, జిల్లా ఈ సి మెంబర్ ఉద్దగిరి గోవింద కృష్ణ, మండల సేవాదళ్ ప్రెసిడెంట్ కె.వి.సత్యనారాయణ మరియు సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.
Admin
Rapid TV