Saturday, 12 September 2026 01:56:06 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

మీడియాపై దాడులు ఖండిస్తూ APWJF ధర్నా

Date : 22 February 2024 10:52 AM Views : 256

Rapid TV - Andhra Pradesh / Anakapally : మీడియా పై దాడులను ఖండిస్తూ APWJF ధర్నా అనకాపల్లి : పత్రికా కార్యాలయాలు, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఫెడరేషన్ బుధవారం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడండి... మీడియా పై దాడులను అరికట్టండి అంటూ పాత్రికేయులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు భీమరశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ. రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలను అధికార పార్టీ వర్గాలు టార్గెట్ చేసుకుని వరుస దాడులకు పాల్పడుతున్న ప్రభుత్వం చోద్యం చూస్తుండడం విచిత్రంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కాని, మంత్రులు కాని ఈ దాడులను ఖండించకపోవడం చూస్తుంటే అధికార పార్టీ తెర వెనుక ఉండి ఈ దాడులను ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తుందని అన్నారు. మీడియా పై దాడులు ఆపకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉదృతమైన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో చిన్ని కృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బి. కొండలరావు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, కార్యదర్శులు పి. నాగ శ్రీను, పి. రామారావు, సీనియర్ పాత్రికేయులు, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు ఎస్.కె చాంద్ బాషా, తిమ్మాపాత్రుని రమేష్, సీనియర్ పాత్రికేయులు కాండ్రేగులమోహన్ బాబు, కే. చంద్రశేఖర్, పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు గంటా శ్రీనివాస్, మోల్లేటి గంగాధర, నటరాజ్, శశి, జగదీష్, గణేష్, నానాజీ, షణ్ముఖ లక్ష్మణ్, గోపాల్, అప్పారావు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: