Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టి వి రావికమతం : సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ కార్యక్రమం మండలంలోని కొత్తకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ జి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా వంద మందితో నాలుగు కిలోమీటర్లు పరుగు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ దేశానంత ఒకే తాటిపైకి తీసుకువచ్చిన మహనీయులని ఆయన అడుగుజాడల్లో భారతీయులంతా ఉండాలని దేశ ఐక్యత సమైక్యత కు ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకమని అన్నారు, ఈ కార్యక్రమంలో కొత్తకోట సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు శ్రీనివాస్, రామకృష్ణ, రఘువర్మ మరియు సిబ్బంది అలాగే దాదాపు వంద మంది పాల్గొని నాలుగు కిలోమీటర్ల పరుగు ఉత్సాహంగా పూర్తి చేశారు.
Admin
Rapid TV