Sunday, 13 September 2026 09:50:41 PM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ:: జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్

Date : 21 October 2024 07:53 PM Views : 296

Rapid TV - Andhra Pradesh / Anakapally : పత్రికా ప్రకటన *నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ* *జిల్లా కలెక్టరు విజయ క్రిష్ణణ్* అనకాపల్లి, అక్టోబరు 21: జిల్లాలో నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషను జారీ చేసినట్లు జిల్లా కలెక్టరు విజయ క్రిష్ణణ్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరు ఛాంబరులో నిర్వహించిన పత్రికా విలేఖరుల సమావేశంలో జిల్లాకలెక్టరు ఎన్నికల నోటిఫికేషను వివరాలు తెలియజేసారు. జిల్లాలో ఒక మేజరు, మూడు మీడియం,ఒక మైనరు నీటి ప్రోజెక్టు సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలోని సాగునీటి వనరుల కింద ఉన్నటువంటి సాగునీటి సంఘాలకు అక్టోబరు 21 నుంచి నవంబరు 29వ తేదీ వరకు వివిధ దశలలో ఎన్నికలు నిర్వహించుటకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు చెప్పారు. జిల్లాలో పెద్దతరహా నీటిపారుదల వనరులు కింద తాండవ జలాశయం వస్తుందని తెలిపారు. ప్రోజెక్టు కమిటీలు 4, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు 3, నీటి వినియోగ దారుల సంఘాలు 303 ఉన్నట్లు జిల్లా కలెక్టరు తెలిపారు. ఈ రోజునుండి ఓటరు లిస్టులను శుద్దీకరణ చేయడం జరుగుతుందని, ఇంతవరకు ఎన్నికలు జరుగని పెద్దేరు జలాశయానికి కొత్తగా ఓటరు లిస్టు తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఇతర శాఖల నుండి 668 గెజిటెడ్ అధికారులను పోలింగు అధికారులుగా, 1530 మంది పోలింగుసిబ్బందిని నియమించడంజరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎ. త్రినాధన్, డిఇ రాజేంద్రకుమార్ పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :