Tuesday, 28 July 2026 10:48:50 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

: 2024 సార్వత్రిక ఎన్నికల్లో 43,767 ఓట్ల మెజార్టీ తో గెలుపొందిన పాయకరావుపేట వంగలపూడి అనిత

Date : 05 June 2024 08:42 AM Views : 242

Rapid TV - Andhra Pradesh / అనకాపల్లి : అనకాపల్లి జిల్లా : 2024 సార్వత్రిక ఎన్నికల్లో 43,767 ఓట్ల మెజార్టీ తో గెలుపొందిన పాయకరావుపేట కూటమి టి.డి.పి అభ్యర్థి వంగలపూడి అనిత ఇంటి వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. పాయకరావుపేట వై.సి.పి అభ్యర్థి కంబాల జోగులు పై గెలుపొందిన అనిత అనకాపల్లి కౌంటింగ్ సెంటర్ నుండి నేరుగా ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం ఉపమాక వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం నక్కపల్లి క్రిష్ టౌన్ షిప్ లో ఉన్న తన స్వగృహం నకు ఊరేగింపుగా విచ్చేశారు. అనిత స్వగృహంకు చేరుకున్న కూటమి నాయకులు ,కార్యకర్తలకు ఆమె అభివాదం చేశారు. తన గెలుపుకు కృషి చేసిన వారందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేశారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు ఇచ్జి విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మందుగుండు సామాగ్రి కాల్చి ,స్వీట్లు తినిపించుకున్నారు. వంగలపూడి అనిత ఇంటి వద్ద నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాలతో డ్యాన్సులు చేశారు. అంతకుముందు ట్రాన్సజెండర్ల బృందం కూటమి తరపున గెలిచిన అనిత కు గుమ్మడికాయలతో దిష్టి తీశారు.హారతులు పట్టారు.

G. RAJU S RAYAVARAM

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :