Tuesday, 07 April 2026 02:45:22 PM
# మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక # గ్రామీణ ప్రాంతాల సమస్యలపై దృష్టి సారించాలి అఖిలపక్ష నేతల విజ్ఞప్తి # రైతులు తమ పంటను డైరెక్ట్ గా (ఎఫ్ పి ఓ) అమ్ముకునే విధానం ద్వారా రైతులకు మేలు: జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ # పాయకరావుపేట నుండే ప్రక్షాళన చేస్తా # ఎమ్మెల్యే కొణతాల అనకాపల్లిలో సుడిగాలి పర్యటన # అవసరమైతే సొంత నిధులు ఇస్తా జల్లూరు బ్రిడ్జి వెంటనే పూర్తి చేయండి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ # పాండురంగ స్వామి ని దర్శించుకున్న హోంమంత్రి అనిత

నా రాజకీయ భవిష్యత్తు మొత్తం అనకాపల్లిలోనే :ఎంపీ సీఎం రమేష్

Date : 15 June 2024 05:27 PM Views : 243

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి తన కార్యాలయంలో శనివారం ఎంపీ సీఎం రమేష్ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారీ మెజార్టీతో గెలిపించిన మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు జిల్లా ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. జీవితాంతం నా రాజకీయ భవిష్యత్తు అంతా అనకాపల్లిలోనే కొనసాగిస్తానని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు లో 21 మంది ఎంపీలతో కీలకపాత్ర పోషించనున్నామనీ తెలిపారు. గడచిన ఐదేళ్ల వైసిపి పాలనలో ఏపీలో అరాచక పాలన సాగిందనీ విమర్శించారు. ప్రజా సొమ్మును వారు ఇష్టానుసారం దోచుకున్నారనీ అన్నారు.గత ప్రభుత్వ పాలనలో జరిగిన ప్రతి ఒక్క అవినీతిపై పూర్తి ఆధారాలతో ముఖ్యమంత్రికి రాతపూర్వక ఫిర్యాదు చేస్తానన్నారు. రాష్ట్రంలో లిక్కర్ పాలసీ, మైనింగ్ కార్పొరేషన్ లో భారీ అవినీతి జరిగిందనీ దీనిపై పూర్తి విచారణ చేస్తామని అన్నారు. డిప్యుటేషన్ పై వచ్చిన అధికారులు వాసుదేవ రెడ్డి, వెంకటరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి , మధుసూదన రెడ్డి తోపాటు పదిమంది ఐపీఎస్ అధికారులు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనీ వీళ్ళందర్నీ చట్టబద్ధంగా శిక్షిస్తామని అన్నారు. వారందరిపై పూర్తిస్థాయి విచారణ జరిపించి ఖచ్చితంగా శిక్షపడేలా చేస్తానన్నారు. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన అధికారులు ఇప్పటికే దొడ్డిదారిన పారిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఎవర్ని వదిలిపెట్టేది లేదనీ అన్నారు. భవిష్యత్తులో ఏకాభిప్రాయంతో కూటమి ముందుకు వెళుతుందనీ వైసిపి పార్టీలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి కూటమిలో చేరడానికి ప్రయత్నిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో వారిని చేర్చుకునేదే లేదన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వర్ రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి రత్నాకర్, బిజెపి పార్టీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్, అనకాపల్లి జిల్లా బిజెపి అధ్యక్షులు పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :