Saturday, 12 September 2026 08:03:00 PM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

జనసేన దళిత మహా సభ

దళితుల అభివృద్ధికి పోరాడుతాం

Date : 19 January 2024 09:25 PM Views : 266

Rapid TV - Andhra Pradesh / Anakapally : మండలంలోని కొత్తకోట గ్రామంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో దళిత భహిరంగ సభ జరిగింది. ఈసందర్బంగా చోడవరం నియోజకవర్గ ఇంచార్జి పివిఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ప్రస్తుత వైసిపి ప్రభుత్వం లో దళితుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని గతంలో ఉన్న అనేక పథకాలను పూర్తిగా ఆపివేయడం జరిగిందని కేవలం అందరికీ అందించే కొన్ని సంక్షేమ పథకాలు తప్ప దళితులకు అందవలసిన పలు ప్రత్యేక పథకాలను రద్దు చేయడం వలన వారు తీవ్రమైన పేదరికంలోకి జారిపోయారని, రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన సబ్ ప్లాన్ నిధులను మళ్లించడం అలాగే సబ్సిడీపై ఇవ్వాల్సిన రుణాలను నిలిపి చేయడం కులాంతర వివాహాలకు సంబంధించిన ప్రోత్సాహకాలను నాలుగున్నర సంవత్సరాల నుండి లక్షల మందికి ఇవ్వకపోవడం ఇలా పలు పథకాలను ఆపివేయడం వల్ల దళితులు మొత్తం పూర్తిగా ఇబ్బందులకు గురైన పరిస్థితి ఉందని అన్నారు. ఈ పరిస్థితికి జగన్ మోహన్ రెడ్డి పరిపాలన కారణమని దుయ్యబట్టారు. నా ఎస్సీలు అని చెప్పే జగన్ మోహన్ రెడ్డికి ఈ రోజు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో కట్టించామని గొప్పలు చెప్పుకుంటున్నారని విగ్రహాలు కట్టించడం శుభ పరిణామమని కానీ అంబేద్కర్ గారి స్ఫూర్తితో చేపట్టాల్సిన దళితులకు సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేయకపోవడం అనేది అత్యంత దుర్మార్గమని అలాగే నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఉన్న దళితుల సమస్యలు అతి తీవ్రంగా ఉన్నాయని శిథిలమైపోయిన ఇళ్లకు కనీసం రిపేర్ చేయించుకోలేని స్థితిలో వేలాది గృహాలు ఉన్నాయని, సిసి రోడ్లు, డ్రైనేజీలు సౌకర్యాలు లేని దళిత కాలనీలు, ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు లేక యావత్ దళిత సోదరీ సోదరీమణులు అష్ట కష్టాలకు గురైన పరిస్థితి దాపురించిందని ఆయన అన్నారు. దళితులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రావలసిన పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మోకాలు అడ్డడం, స్పందించకపోవడం వారిని మోసం చేయడమే అని ఆయన అన్నారు. రాబోయే జనసేన తెదాపా ప్రభుత్వంలో దళితులను అన్ని రకాలుగా ఆదుకుని తీరుతామని అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి వారి సమస్యల పరిష్కారంతోపాటు వారి అభివృద్ధి సంబంధించిన అన్ని ఉపాధి అవకాశాలు చోడవరం నియోజకవర్గంలో కల్పించి తీరుతామని ఈ దిశగా వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించడానికి సహకరించాల్సిందిగా వారిని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి శివ దత్ మాట్లాడుతూ అన్ని పథకాలను ఆపి దళితులకు అత్యంత అన్యాయం చేసిన ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం మిగిలిపోతుందని ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని అంతమొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ దిశగా దళిత సోదరులందరూ కలిసి రావాలని ఒకసారి అధికారం వచ్చిన తర్వాత అన్ని సమస్యలకు జనసేన పార్టీ పరిష్కారం చూపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు దళిత నాయకులు అధిక సంఖ్యలో దళితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సమావేశంలో కొత్తకోట గ్రామంలో ఈ మధ్యకాలంలో చనిపోయిన ఇద్దరు జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తలకు 5వేల రూపాయలు చొప్పున ఇంచార్జ్ పీవీఎస్ రాజు గారు సొంతంగా నగదు సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మైచర్ల నాయుడు , బలిజ మహారాజు, డిఎస్ నాయుడు , గునూరు మూలునాయుడు, కర్రి రమేషు, ఎడ్ల రామ్మూర్తి , గుండు గణేష్, దాసరి చిన్నబ్బాయి , లొట్ల శివ, చింతల కిషోర్, వీర మహిళ నాయకురాళ్లు పాల్గొన్నార

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :