Tuesday, 28 July 2026 11:38:40 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

యలమంచిలి లో గురుకుల పాఠశాల ను సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్

Date : 18 October 2024 09:11 PM Views : 323

Rapid TV - Andhra Pradesh / Anakapally : విద్యార్థుల్లో ఉన్న వైజ్ఞానిక ప్రతిభను ఉపాధ్యాయులు వెలికి తీయాలి - ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ యలమంచిలి, న్యూస్ : చిన్న వయసు నుండి విద్యార్థుల్లో ఉన్న వైజ్ఞానిక ప్రతిభను ఉపాధ్యాయులు వెలికి తీయాలని, పోటీ తత్వాన్ని పెంచేందుకు ఈ సైన్సు ఎగ్జిబిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ అన్నారు. యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో కొక్కిరాపల్లి వద్దగల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల లో ఏర్పాటుచేసిన సైన్స్ కేరును ఎమ్మెల్యే సుందరపు, సబ్ కలెక్టర్ జాహ్నవి ప్రారంభించారు. విశాఖ అనకాపల్లి జిల్లాల నుండి 11 గురుకుల పాఠశాలల విద్యార్థులు బాలురు 4 పాఠశాలల నుండి, బాలికలు 7 పాఠశాలలనుండి 200 మంది విద్యార్థులు, 70 మంది పాఠశాల టీచర్లు పాల్గొని అనేక పరిశోధనలు చేసి తమ ప్రతిభను చాటారు.ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు సృజనాత్మకతను పెంచే రకరకాల పరిశోధనలు చేయడం ద్వారా రానున్న రోజుల్లో వీరే సమాజాన్ని మార్చే భావి భారత పౌరులు అవుతారని అన్నారు. పర్యావరణ రహిత గ్రామాలు నిర్మాణం, సోలార్ విద్యుత్తు తయారీ, మంచినీటి శుద్ధి చేసే యంత్రాంగం తదితర ప్రాజెక్టులు వీక్షించి తయారుచేసిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జాహ్నవి మాట్లాడుతూ విద్యతోపాటు ప్రతిభ పాఠాలు నేర్పేందుకు ఈ సైన్స్ ప్రాజెక్ట్ ఎంతగానో ఉపయోగపడతాయని పాఠశాల ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రోత్సహించాల న్నారు. ప్రిన్సిపల్ మల్ల మాణిక్యం పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిఐఈఓ సుజాత మాట్లాడుతూ విశాఖ, అనకాపల్లి జిల్లాలో గల అంబేద్కర్ గురుకుల పాఠశాలలనుండి పాల్గొన్న 200 మంది విద్యార్థుల్లో 16 మందిని ఎంపిక చేయడం జరుగుతుందని, వీరిని విశాఖలో జరుగు జోనల్ సైన్స్ స్పేర్ కే పంపించడం జరుగుతుందని, దానిలో ఎంపికైన వారిని పల్నాడు జిల్లాలో జరుగు రాష్ట్ర వ్యాప్త సైన్స్ ఫెయిర్ లో పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఒ రూపవతి, డి ఈఓలు అరుణ కుమార్, వెంకటలక్ష్మి, బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేశ్వరి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శైలజ, స్థానిక కౌన్సిలర్ మధ్య రామకృష్ణ, జడ్జెస్ కాళిదాసు, రమేష్, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు శాంత కుమారి, కొణతాల విశ్వేశ్వరరావు, పాపాజీ, కూటమి నాయకులు బొద్దపు శ్రీను, గొర్లి నానాజీ, ఆడారీ రమన బాబు, వైస్ ఎం పి పి రాజాన శేషు, కోటారు సాంబ, ఆడారి ఆదిమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :