Saturday, 12 September 2026 08:01:29 PM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

అనకాపల్లి జిల్లాకి త్వరలో నరేంద్ర మోడీ :: ఎంపీ సీఎం రమేష్

Date : 26 October 2024 04:24 PM Views : 356

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా పారిశ్రామిక అభివృద్ధి ధ్యేయం వచ్చే నెలలో నక్కపల్లి ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోడీ రాక:: అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీ.ఎం రమేష్ శనివారం అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పి. భీమవరం గ్రామం లో బీజేపీ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు ఈర్లే శ్రీరామ మూర్తి గారి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ అభినందన సభ లో ముఖ్యఅతిథిగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎం.పీ సీఎం రమేష్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం స్థానిక ప్రజా ప్రతినిధులు కట్టుబడి ఉన్నారు అని, భారత గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చే నెల రోజుల్లో అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో కొత్తగా మంజూరైన ఇండస్ట్రియల్ కారిడార్కు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవడానికి సానుకూలంగా స్పందించారని మన ప్రాంతానికి మోదీ గారు విచ్చేసి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీకి భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజలకు మోదీ గారు ధన్యవాదాలు తెలియజేస్తారు అని పేర్కొన్నారు.అదేవిధంగా మరిన్ని భారీ పరిశ్రమలు జిల్లాకు వస్తున్నట్లు మాడుగుల ప్రాంతంలో ఇప్పటికే సెజ్ మంజూరు కొరకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని.అనేక రంగాల పరిశ్రమలు స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని, ప్రాంత రైతాంగానికి పూర్తిగా అండగా ఉంటామని, ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రాంత ప్రజలకు సాగునీరు తాగునీరు కల్పనకు కృషి చేస్తామని తెలియజేశారు.ఈ సమావేశంలో చోడవరం శాసన సభ్యులు కే ఎస్ ఎన్ ఎస్ రాజు గారు, మాడుగుల శాసన సభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి గారు స్టేట్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు గారు,అర్బన్ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ గారు, జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ పివీఎస్ ఎన్ రాజుగారు,ఎం ఎల్ సీ పాకలపాటి రఘు వర్మ గారు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ గారు,రాష్ట్ర కార్యదర్శి కేతినేని సురేంద్రమోహన్ గారు,జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు గారు మరియు స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :