Thursday, 30 July 2026 04:14:28 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

భావ వ్యక్తీకరణకు చిత్రలేఖనం దోహదపడుతుంది:: జిల్లా ఉప విద్యాశాఖ అధికారి పి అప్పారావు

Date : 06 June 2024 10:02 AM Views : 170

Rapid TV - Andhra Pradesh / Anakapally : భావవ్యక్తీకరణకు చిత్రలేఖనం దోహదపడుతుంది జిల్లా ఉప విద్యాశాఖాధికారి పి.అప్పారావు అనకాపల్లి : భావవ్యక్తీకరణకు చిత్రలేఖనం దోహదపడుతుందని జిల్లా ఉప విద్యాశాఖాధికారి పి.అప్పారావు పేర్కొన్నారు. గ్రీన్‌ క్లబ్‌ వ్యవస్ధాపకులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుగ్రహీత కొణతాల ఫణిభూషణ్‌ శ్రీధర్‌ ఆధ్వర్యంలో శ్రీ గౌరీ గ్రంథాలయంలో పర్యావరణ దినోత్సవం సందర్బంగా కిడ్స్‌, జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో బుధవారం జరిగిన చిత్ర లేఖన పోటీల విజేతలకు ఆయన బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభ ఉంటుందని దానిని తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహిస్తే పిల్లలు ఆ రంగంలో అగ్రస్థాయికి చేరతారని అన్నారు. ప్రస్తుత సమాజంలో ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను చిన్నారులు బొమ్మల ద్వారా చూపించడం అభినందనీయమన్నారు. ఏదైనా విషయం చెబితే అందుకు అనుగుణంగా సృజనాత్మక శక్తితో అద్భుతంగా చిత్రాలు గీయడమే చిత్రలేఖనమన్నారు. రంగుల స్వభావాన్ని బట్టి సందేశాత్మక పెయింటింగులు వేయడాన్ని అలవరచుకోవాలన్నారు. సామాజిక పరిస్థితులను ఆలోచించే గలిగేలా ఆధునిక చిత్రకళలో విద్యార్ధులు రాణించాలన్నారు. కంప్యూటర్‌ సహాయంతో కూడా విభిన్నమైన పెయింటింగ్‌ వేయడానికి ప్రయత్నం చేయాలని జిల్లా ఉప విద్యాశాఖాధికారి పి.అప్పారావు అన్నారు. గ్రీన్‌ క్లబ్‌ వ్యవస్ధాపకులు కొణతాల ఫణిభూషణ్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి కర్తవ్యమన్నారు. భవిష్యత్‌లో జిల్లాలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో శ్రీ గౌరీ గ్రంథాలయ కార్యదర్శి కాండ్రేగుల వెంకటరమణ, గ్రీన్‌ క్లబ్‌ గౌరవ అధ్యక్షుడు పెంటకోట ఉమామహేశ్వరరావు, క్లబ్‌ ప్రతినిధులు విశ్రాంత జిల్లా అటవీశాఖాధికారి జానకీరావు, విశ్రాంత అటవీ శాఖ రేంజర్‌ బి.వినోద్‌కుమార్‌, ఆర్‌.అనిత, నీలవేణి, నగిశెట్టి సత్తిబాబు, బేతాళం శేషసాయి, కె.రాజేష్‌, కె.గణేష్‌ పాల్గొన్నారు. అనంతరం శ్రీ గౌరీ గ్రంథాలయం ఆవరణలో మొక్కలు నాటారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: