Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ అనకాపల్లి.... అనకాపల్లి ట్రాఫిక్ పోలీసులకు కూలింగ్ గాగుల్స్, టోపీలు అనకాపల్లి ట్రాఫిక్ పోలీసులకు వాసవి క్లబ్, కెమిస్ట్ అసోసియేషన్, అలయన్స్ క్లబ్ సహకారంతో టోపీలను, సాయిరాజా వెల్ఫేర్ ట్రస్ట్, రాజా ఆప్టికల్స్ అండ్ కంటి ఆసుపత్రి సహకారంతో కూలింగ్ కళ్లజోళ్లు బుధవారం ఉదయం అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ సిఐ ఎం వెంకట నారాయణ గారి చేతులమీదుగా పోలీసులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ ఎం వెంకటనారాయణ మాట్లాడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వాసవి క్లబ్, కెమిస్ట్ అసోసియేషన్ అలయన్స్ క్లబ్ వారిని మరియు ఎంతోమంది పేద ప్రజలకు సొంత నిధులతో ఉచిత కంటి పరీక్ష శిబిరాలు నిర్వహిస్తూ ఉచిత ఆపరేషన్లు చేయిస్తూ ఈరోజు ట్రాఫిక్ పోలీసులకు ఉచితముగా కూలింగ్ కళ్ళజోళ్ళను అందించిన పూసర్ల రాజాను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సాయిరాజా వెల్ఫేర్ ట్రస్ట్ మరియు రాజా ఆప్టికల్స్ అండ్ కంటి ఆసుపత్రి అధినేత పూసర్ల రాజా మాట్లాడుతూ విధి నిర్వహణలో తమ కుటుంబాన్ని ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఎండలో సైతం ప్రజా సేవకే అంకితమైన పోలీసులకు ఈ విధంగా ఈరోజు కళ్ళజోళ్ళు ఇవ్వడం చాలా ఆనందదాయకమని అన్నారు. శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి, విశాఖపట్నం వారి సహాయ సహకారాలతో ఉచిత కంటి పరీక్ష శిబిరాలు నిర్వహిస్తున్నామని, అవసరమైన వారికి వారి సహాయ సహకారాలతో పూర్తి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తున్నామని, ఎవరికైనా ఎక్కడైనా ఉచిత కంటి శిబిరాలు నిర్వహించాలన్న, ఉచిత కంటి ఆపరేషన్లు చేయించాలన్న 903 222 3330 కు సంప్రదించాలని పూసర్ల రాజా కోరారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్, అలయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మరియు సభ్యులు, కెమిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివ, ట్రాఫిక్ si శేఖర్, అనే యువతి హెడ్ కానిస్టేబుల్ రెడ్డి శీను సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Rapid TV