Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి రావికమతం : దేశభద్రతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రావికమతం సబ్ ఇన్స్పెక్టర్ రఘువర్మ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ రఘువర్మ జాతీయ పతాక ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ దేశ సమగ్రత సౌభాగ్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని సూచించారు ఈ దేశానికి స్వతంత్రం రావడానికి ఎంతో మంది మహానుభావులు యొక్క కృషి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని విద్యార్థిని విద్యార్థులు ఉద్దేశించి తెలిపారు విద్యార్థినిలు జాతీయ గీతాలాపన చేసారు.
Admin
Rapid TV