Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ:: అనకాపల్లి రైల్వే స్టేషన్ ను పరిశీలించిన కేంద్ర రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ & అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. .. ఆరు నెలల్లో అభివృద్ధి చేస్తామన్న ఎంపీ సీఎం రమేష్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఉన్న రైల్వేస్టేషన్ లను దశలవారీగా అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేశారు. అందులో భాగంగా అనకాపల్లి కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం అనకాపల్లి జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగింది. అనకాపల్లి లో ప్రయాణికులకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించి అనకాపల్లి రైల్వే స్టేషన్ ను అత్యాధునికంగా ఆధునికరించడానికి పూర్తి చర్యలు తీసుకుంటాను. లక్ష్మీదేవి పెట వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్ళించింది. తక్షణం అధికారులతో చర్చించి ఫ్లైఓవర్ నిర్మాణానికి చర్యలు చేపడతాను. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, టిడిపి నాయకులు దాడి రత్నాకర్, బిజెపి అనకాపల్లి జిల్లా ప్రెసిడెంట్ పరమేశ్వరరావు, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
Rapid TV