Rapid TV - Andhra Pradesh / Anakapally : పాయకరావుపేట రాపిడ్ టీవీ:: ఎస్.రాయవరం లో "డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు" , స్టాప్ డయేరియా మరియు లెప్రసి వ్యాధి పై నిర్వహించిన అవగాహన సదస్సులు* *. ........................................... అనకాపల్లి జిల్లా యస్. రాయవరం మండలం సర్వసిద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి లో అన్ని గ్రామాల్లో *"డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు" ,స్టాప్ డయేరియా మరియు లెప్రసి వ్యాధి నిర్ధారణ సర్వే ఆవశ్యకత ను పురస్కరించుకొని జిల్లా ఇన్ ఛార్జ్ వైద్య ఆరోగ్య శాఖాధికారి మరియు జిల్లా లెప్రసీ ,టి.బి, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ ఎం.ఎస్.వి. కె.బాలాజీ మరియు జిల్లా మలేరియా అధికారి కె. వరహాలు దొర ఆదేశాలు మేరకు. కీటక జనిత వ్యాధులయిన *( వెక్టార్ బోర్న్ డిసీజెస్ )* డెంగ్యూ, చికెన్ గున్యా,మలేరియా, ఫైలేరియా,మెదడువాపు రావటానికి గల కారణాలపై మరియు నీటి జనిత వ్యాధులపై *( వాటర్ బోర్న్ డిసీజెస్ )* అనగా వాంతులు ,విరోచనాలు, టైఫాయిడ్, కామెర్లు మరియు ప్రస్తుతం జరుగుచున్న కుష్టు వ్యాధి నిర్ధారణ సర్వే లో ముఖ్యంగా ఎవరికైనా వారి వంటిపై స్పర్శ లేని, తిమ్మిర్లు,దురద లేని మచ్చలు వున్న , చెవి పై ,వీపు పై, ఎదపై నొప్పి లేని బొడిపెలు, కను బొమ్మలు, కను రెప్పలు వెంట్రుకలు రాలిపోవడం, ఆరి కాళ్ళు ,ఆరి చేతుల్లో స్పర్శ కోల్పోవడం, చేతులు నుండి వస్తువులు జారి పోవటం,చేతి వేళ్ళు, కాలి వేళ్ళు వంకర్లు తిరిగి అంగవైకల్యం రావటం వంటి లక్షణాలు వుంటే వెంటనే మీ దగ్గరకు వచ్చే మా ఆరోగ్య సిబ్బంది తో తనిఖీ చేయించుకొని అది లెప్రసి మచ్చా అవునా..కాదా నిర్ధారణ కు వచ్చిన పిదప అరు నెలల మల్టి డ్రగ్ థెరపీ ద్వారా చికిత్స తీసుకుని ప్రారంభ దశలోనే ఈ వ్యాధి ని అరికట్ట గలమని అవగాహన సదస్సు లు లో ప్రజలను ఉద్దేశించి మెడికల్ ఆఫీసర్ లు *డాక్టర్.ఎస్.ఎస్.వి.శక్తి ప్రియ మరియు డాక్టర్ ఎన్. వాసంతి సంయుక్తంగా అవగాహన కల్పించారు*. అలాగే జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి పి.జె.ఎం.అర్. పి.నాయుడు సూచనలు తో ఆరోగ్య విస్తరణ అధికారి టి నాగేశ్వరరావు పర్యవేక్షణలో సర్వసిద్ది లో గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సు ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు నీటి నిల్వలు లేకుండా, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ అప్పుడు మాత్రమే అందరూ విష జ్వరాలు బారిన పడకుండా ఉండేందుకు దోహదపడుతుందని ,క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే త్రాగాలనీ తద్వారా డయేరియా బారిన పడకుండా ఆరోగ్యంగా వుండొచ్చునని అవగాహన కల్పించారు . అలాగే ఈ రోజు అన్ని గ్రామాల్లో ఫ్రై డే..డ్రై డే సందర్భంగా యాంటీ లార్వా ఆపరేషన్ లు నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్. రాయవరం లో నిర్వహించిన అవగాహన సదస్సు ని ఉద్దేశించి ఎఫ్.డి.పి క్లస్టర్ పర్యవేక్షకులు *డాక్టర్ పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్* మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇంట్లో నీటి నిల్వలు మూడు రోజులకు మించి వుంటే ఆ నీటిలో దోమలు వృద్ధి చెంది అవి జ్వరాలు రావటానికి కారణం అవుతున్నాయని ,అలాగే నీరు మరగ కాచి చల్లార్చి వడబోసిన నీటిని మాత్రమే నీటి జనిత వ్యాధులయిన డయేరియా, టైఫాయిడ్,కామెర్లు అరికట్టవచ్చని తెలిపారు. అలాగే వంటిపై స్పర్శ లేని తిమ్మిర్లు,దురద లేని రాగి రంగు మచ్చలు వుంటే తక్షణం అశ్రద్ధ చేయకుండా మీ ఇంటికి సర్వే కొరకు వస్తున్న మా ఆరోగ్య సిబ్బంది కి చూపించి వారు అది లెప్రసీ అనుమానిత మచ్చగా భావిస్తే నిజ నిర్ధారణ కొరకు సర్వసిద్ది పి.హెచ్.సి డాక్టర్ వద్ద కు పంపి అక్కడ నిర్ధారణ అయిన పిదప అరు నెలలు మాత్రల కోర్సు ఉచితంగా ఇస్తారని తదుపరి అందరి కలిసి మాములు జీవితాన్ని గడపవచ్చునని ప్రజలకు అవగాహన కల్పించారు .వీరితో పాటు టి.బి.సూపర్ వైజర్ లు ..సత్యనారాయణ , రాధిక మరియు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జి.కొండబాబు, ఏ.ఎన్.ఎం.. పి. నూకరత్నం, ,ఆశా కార్యకర్తలు,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Reporter
Rapid TV