Monday, 14 September 2026 05:49:34 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

నర్సీపట్నం డి.ఎస్.పి ఆధ్వర్యంలో గిరిజన గ్రామంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమం .

Date : 17 June 2025 07:21 AM Views : 340

Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV, నర్సీపట్నం : జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నర్సీపట్నం డి.ఎస్.పి పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కృష్ణదేవిపేటలోని అల్లూరి పార్కు సమీపంలోని చుక్కపణుకు పివిటీజీ గిరిజన గ్రామంలో సోమవారం ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గిరిజనుల వసతులు, ఆరోగ్య సమస్యలు, మౌలిక సదుపాయాలలో భాగమైన త్రాగునీరు తదితర అంశాలను డి.ఎస్.పి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హోమియో డాక్టర్ హేమలత సహకారంతో మెడికల్ క్యాంపు నిర్వహించి, గ్రామస్తులకు ఉచితంగా మందులు అందించారు. గ్రామస్తుల కోరిక మేరకు ప్రతి కుటుంబానికి గొడుగులు, చీరలు, పంచెలు, యువతకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి మాట్లాడుతూ, యువత చెడు వ్యసనాలకు బానిసలవ్వకుండా క్రీడా నైపుణ్యం, వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలని, యువత తమ జీవితాలను సక్రమమైన మార్గంలో నడిపించుకోవాలని ఆయన సూచించారు. గిరిజనుల కోరిక మేరకు త్వరలో త్రాగునీటి కొరకు వాటర్ ఫిల్టర్ అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ, కృష్ణదేవి పేట ఎస్ఐ వై తారకేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

PALLA GOVINDARAO

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :