Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ న్యూస్ రావికమతం : సీడ్ బాల్స్ శిక్షణ కార్యక్రమాన్ని అనకాపల్లి డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎం సోమసుందరం ఆదివారం మండలం లోని మరుపాక నర్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు అనకాపల్లి సామాజిక అటవీశాఖ పరిధి లో ఎనిమిది లక్షల సీడ్ బాల్స్ విత్తనాలు తయారు చేయాల్సి ఉందని అన్నారు. ఈ అంశంపై చోడవరం, రావికమతం మండలం మరుపాక నర్సీపట్నంలో శిక్షణ కార్యక్రమాలను చేపట్టామని శిక్షణ అనంతరం వెంటనే మట్టి, పేడ బొగ్గు పౌడర్ లతో కలిపి సీడ్ బాల్స్ తయారు చేస్తున్నారని ఎనిమిది రకాల విత్తనాలను ఈ కార్యక్రమంలో వినియోగిస్తున్నామన్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యాక డ్రోన్ సహాయంతో గాని హెలికాప్టర్ సహాయంతో గానీ ప్రభుత్వం నిర్ణయం మేరకు అటవీ పరిధిలో వీటిని చల్లుతామని వర్షాలు పడిన తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుందని తద్వారా సహజ సిద్ధమయిన ఫారెస్ట్ పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చోడవరం సామాజిక అటవీ పరిధి అధికారి జగదీష్ చోడవరం మాడుగుల సెక్షన్ అధికారి జె. రమణ సిబ్బంది ఎస్. కొండలరావు వన సేవకులు పాల్గొన్నారు. అనంతరం రావికమంతం మండల కేంద్రంలోని ఇటీవల పెద్దిరాజు చెరువు పై చెరువు గట్లపై వేసిన మొక్కలను ఆయన పరిశీలించి తగు సూచనలు చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. మృతి చెందిన మొక్కలువద్ద వర్షాలు పడిన వెంటనే మరలా మొక్కలు వేయాలని సాసర్ వర్క్ చేయాలని సూచించారు.
Admin
Rapid TV