Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి రావికమతం: మండల కేంద్రం రావికమతం లో. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా రావికమతం ఆర్యవైశ్య యువజన వర్తక, సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి క్షీరాభిషేకం, కుంకుమ పూజలు, అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని గ్రామ పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు
Admin
Rapid TV