Rapid TV - Andhra Pradesh / Anakapally : రావికమతం రాపిడ్ టివి : మండలంలోని గొంప గ్రామంలో బెల్ట్ షాప్ పై సోమవారం పోలీసులు దాడులు నిర్వహించి 149 మద్యం సీసాలను స్వాధీన పరుచుకున్నారు. ఎస్ బి సమాచారం మేరకు గొంప గ్రామానికి చెందిన కొప్పాక నాగేశ్వరరావు పాన్ షాప్ లో అక్రమంగా బెల్ట్ షాపు నడుపుతున్నాడనే సమాచారం మేరకు దాడులు నిర్వహించగా సీతయ్యపేట తట్టబంధ మద్యం షాప్ లనుంచి నిబంధనలకు విరుద్ధంగా మద్యం తీసుకువచ్చి పాన్ షాపులో అమ్ముతున్నట్లుగా గుర్తించామని కొప్పాక నాగేశ్వరావు పై కేసు నమోదు చేసామని ఎస్ ఐ తెలిపారు.
Admin
Rapid TV