Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం తట్టబంధ పంచాయితీ కేంద్రంలో ఉన్న తూనిక కేంద్రం వద్ద అక్రమంగా అకేషియా కర్ర రవాణాకు సిద్ధం గా ఉన్నదనే ముందస్తు సమాచారం మేరకు జిల్లా అటవీ శాఖ స్క్వాడ్ డి యఫ్ ఓ యం.సోమ సుందరం రెంజర్ గంగారాజు లు దాడులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మూడు లారీలతో ఉన్న అకేషియా కర్ర ను స్వాధీన పరుచుకుని దొండపూడి చెక్పోస్ట్ వద్దకు తరలించారు, ఈ సందర్భంగా రేంజర్ గంగరాజు మాట్లాడుతూ కలప విలువ మూడు లక్షల రూపాయలు వరకు ఉంటుందని మూడు లక్షలు అపరాదరసం విధించామని తెలిపారు. అయితే స్థానిక అధికార పార్టీకి చెందిన వ్యక్తి చెందిన తూనికకాటా కావడంతో అధికారులపై ఒత్తిడి వచ్చి తక్కువ ఆపరాధరుసుమం విధించి లారీలను విడిచిపెట్టడం జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు, తట్టబంద పంచాయతీకి సమీప సుకుమారకొండ, తదితర అటవీ ప్రాంతాల నుంచి అక్రమంగా చాలా కాలంగా కలప రవాణా అవుతుందని అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ అకేషియా కలప ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడ నరికారు? వీటి మొదల్లు ఎక్కడ ఉన్నాయి? ఈ కలప రవాణాకు అటవీ శాఖ అధికారుల అనుమతులు అవసరం ఉందా లేదా, అకేషియ కర్రకు తొక్క ఎందుకు తీసి రవాణా చేస్తున్నారు, తొక్క తీస్తున్నపుడు, నరుకుతున్నపుడు స్థానిక అధికారులకు తెలియదా కనపడట్లేదా అని స్థానికులు చర్చించుకుంటున్నారు ఈ విషయమే ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Admin
Rapid TV