Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ:: భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ ద్వారపురెడ్డి పరమేశ్వరరావు ఆద్వర్యంలో గురువారం జిల్లా బి.జే.పి నాయకులు అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ మతి ‘’విజయ కృష్ణన్’’గారిని మరియు జిల్లా ఎస్.పి శ్రీ ‘’దీపికా పటేల్’’ గారిని మర్యాద పూర్వకముగా కలవడం జరిగింది. ఈ సందర్బముగా జిల్లాను మరింత అబివృద్ధి పధంలో నడపాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొన్నగంటి అప్పారావు గారు, జిల్లా ప్రదాన కార్యదర్శులు బి.వి.యస్ వర్మ, పట్టాబి ప్రసాద్, ఏ.కొండబాబు, జిల్లా ఉపాద్యష్యులు పొలమరసెట్టి నాగేశ్వరరావు, వనం సత్యనారాయణ, జిల్లా కార్యదర్శులు ఓరుగంటి నాగమణి, సంతోషి కుమారి, కిసాన్ మోర్చా జిల్లా ప్రదాన కార్యదర్శి శేషగిరిరావు, మరియు మండల అధ్యక్షులు నర్సింగ్ యధవ్, కరక సత్యనారాయణ, మారిసెట్టి భాస్కరరావు, కప్పిరి తాతారావు , నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Rapid TV