Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి రావికమతం :దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం మండల కేంద్రం రావికమతంలో సిఐటియు వజ్రపు సత్యవతి ఆధ్వర్యంలో కార్మిక సంఘాల ప్రతినిధులు కార్మికుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ మానవహార కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని 8 గంటల పని దినాన్ని కొనసాగించాలని స్కీం వర్కర్లు అందరికీ కనీసం రూ 26 వేలు ఇవ్వాలని సంక్షేమ పథకాల అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని ముఠా కార్మికులకు సమగ్ర చట్టం అమలు చేయాలని ఈ డిమాండ్ల సాధనకై ఈరోజు దేశవ్యాప్త సమ్మె లో జాతీయ సంఘాల నాయకుల ప్రదేశాల మేరకు పాల్గొనడం జరిగిందన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అక్కడ మానవహారం గా ఏర్పడి హక్కుల పోరాటం కోసం నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు అంగన్వాడి వర్కర్లు వివో ఏలు మధ్యాహ్నం భోజనం కార్మికులు శానిటైజర్ వర్కర్లు ముఠా కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారని సిఐటియు మండల కన్వీనర్ వజ్రపు సత్యవతి అంగనవాడి ప్రాజెక్టు కార్యదర్శి ఎస్ సత్యవేణి మధ్యాహ్నం భోజనం కార్మికుల అధ్యక్షురాలు ఎస్ అమ్మాజీ వివో ఎల సంఘం నాయకులు పుష్ప ముఠా కార్మికుల ధనంజయరావు కే గోవింద్ కార్మికులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Admin
Rapid TV