Thursday, 30 July 2026 01:45:06 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

దాడి అభిమానులతో ఆత్మీయ సమావేశం

Date : 15 April 2024 06:23 PM Views : 206

Rapid TV - Andhra Pradesh / Anakapally : దాడి అభిమానులతో దాడి రత్నాకర్ ఆత్మీయ సమావేశం ఉమ్మడి అభ్యర్థులు గెలవడం చారిత్రాత్మక అవసరం:: దాడి అనకాపల్లి గవరపాలెం రైతు భారతి కళ్యాణ మండపంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ గారి ఆధ్వర్యంలో దాడి అభిమానుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు శ్రీ దాడి వీరభద్ర రావు, కూటమి అసెంబ్లీ అభ్యర్థి శ్రీ కొణతాల రామకృష్ణ, కూటమి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ సీఎం రమేష్, మాజీ శాసనసభ్యులు శ్రీ పీలా గోవింద సత్యనారాయణ హాజరయ్యారు. తెదేపా వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీ దాడి వీరభద్రరావు మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బిజెపి కలిసి కూటమిగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం ఎంతో చారిత్రాత్మకమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫు నుండి దాడి కుటుంబమంతా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి శాయశక్తులా కృషి చేస్తామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నదని దానిని అంతమొందించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దాడి అభిమానులు ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తారన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ అభ్యర్థి శ్రీ కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ అనకాపల్లి 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మాజీ మంత్రి దాడి వీరభద్ర రావు తాను వేరువేరు పార్టీల్లో ఉండి ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ మా మధ్య ఆత్మీయ అనుబంధం ఉందని అన్నారు. తామిద్దరం కలవాలని ఎప్పటినుంచో చాలామంది కోరుతున్నప్పటికీ అది ఈ రూపేన నిజమైందని అన్నారు. మా కలియక అనకాపల్లి అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తాను విశ్వసిస్తున్నట్టు తెలియజేశారు. గత ఐదేళ్లలో అనకాపల్లికి ఎటువంటి అభివృద్ధి జరగలేదని, ఇప్పుడు ప్రజలందరూ పాలన మారాలని అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారని అన్నారు. కూటమి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం బిజెపి వస్తుందని అన్నారు. నేను స్థానిక వ్యక్తిని కాకపోయినప్పటికీ అనకాపల్లి నియోజకవర్గంలోని సమస్యలన్నీ తనకు తెలుసునని వాటిని ఢిల్లీ స్థాయిలో వినిపించే సత్తా తనకుందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అనకాపల్లి అభివృద్ధిని ఏ పార్లమెంటు అభ్యర్థి పట్టించుకోలేదని తాను వచ్చిన తర్వాత అనకాపల్లి ఏడు నియోజకవర్గాలలో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. మాజీ శాసనసభ్యులు శ్రీ పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ అనకాపల్లి కూటమి అభ్యర్థుల గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి ఎంతో మంచి ఆదరణ లభిస్తుందని గెలుపుపై అభ్యర్థులు ధీమాగా ఉండవచ్చు అన్నారు. దాడి రత్నాకర్ మాట్లాడుతూ శ్రీ దాడి వీరభద్ర రావు గారు, శ్రీ కొణతాల రామకృష్ణ గారు వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా ఇరువురు ఎంతో ఉత్తమమైన రాజకీయాలను నడిపి అనకాపల్లి అభివృద్ధికి బాటలు వేశారని అన్నారు. ఇప్పుడు అటువంటి రాజకీయాలు ఎక్కడా కనిపించడం లేదని అభివృద్ధి అయితే అసలే లేదని అన్నారు. అనకాపల్లికి పూర్వ వైభవం తిరిగి రావాలంటే రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం రావాలంటే మన స్థానికుడైన శ్రీ కొణతాల రామకృష్ణ గారిని గెలిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అనకాపల్లి యొక్క పేరు ప్రఖ్యాతలు వినిపించాలంటే మన పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ గారిని గెలిపించాలని దాడి అభిమానులను కోరారు. దాడి జైవీర్ మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో అనకాపల్లిలో భూకబ్జాలు దందాలు పెచ్చు మీరాయని అటువంటి పాలన తక్షణమే అంతం చేయాలనీ పిలుపునిచ్చారు. అనంతరం కూటమి అభ్యర్థులు శ్రీ దాడి వీరభద్రరావు, శ్రీ దాడి రత్నాకర్ లను సాలువతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో దాడి అభిమానులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: