Sunday, 13 September 2026 08:20:17 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

నేడే వేల్పులవీధి గౌరీ పరమేశ్వరుల సంబరం

Date : 20 January 2024 09:01 AM Views : 285

Rapid TV - Andhra Pradesh / Anakapally : నేడే వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల మహోత్సవం.. పట్టణంలోని మెయిన్ రోడ్డు గుండా కళ్ళు మిరిమిట్లు గెలిపే విద్యుత్ లైటింగ్ భారీ స్టేజ్ ప్రోగ్రాములు... కుటుంబ సమేతంగా చూడగలిగిన అతిపెద్ద ఉత్సవం అనకాపల్లి: ఉత్తరాంధ్రలోని పేరుగాంచి 165 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీశ్రీశ్రీ వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల మహోత్సవం జనవరి 20వ తేదీ శనివారం ఘనంగా నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ అధ్యక్షులు వాకాడ బాబు, కార్యదర్శి మద్దాల నూకరాజు, ఉపాధ్యక్షులు శ్రీరం శెట్టి నర్సింగ్ రావు, సహాయ కార్యదర్శి పనస శ్రీకాంత్, కోశాధికారి వేల్పుల గణేష్ లు తెలిపారు. ఉత్సవంలో భాగంగా పట్టణంలోని నాలుగు రోడ్ల జంక్షన్ నుంచి చిన నాలుగు రోడ్ల జంక్షన్ వరకు మెయిన్ రోడ్డు నిండా భారీ విద్యుత్ సెట్టింగులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆలయానికి పూర్ణ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో గుడి అలంకరణ చేపట్టామన్నారు. అలాగే వివిధ నేల వేషాలను ఏర్పాటు చేశామన్నారు. శనివారం ఉదయం నాలుగు గంటల నుంచే ఆలయ ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపారు. భక్తుల సందర్శన అనంతరం అమ్మవారిని వేల్పుల వీధి, పట్టణ పుర వీధుల్లో సాంస్కృతిక కార్యక్రమాలతో శనివారం నుంచి సోమవారం వరకు ఊరేగించనున్నట్లు తెలిపారు .ఈ సందర్భంగా ఆలయం దగ్గర, దిశ పోలీస్ స్టేషన్ ఎదురుగా, పాత శారద బ్రిడ్జి వద్ద ప్రసాద వితరణ చేపడతామన్నారు. అలాగే విజయనగరం వారి పులి వేషం, తాడేపల్లిగూడెం వారి అమ్మవారి తలకాయల ప్రదర్శన, విశాఖ వారి వయ్యారి భామలు వగలమారి భక్తులు, విజయనగరం వారిచే గరిడి, కాకినాడ వారిచే గోపాల గోపాల డాన్స్ కార్యక్రమం, కృష్ణాజిల్లా వారిచే డబ్బుల డాన్స్, సబ్బవరం వారిచే పూసల డాన్స్, కొత్తూరు వారిచే తప్పుడు గుళ్ళు, ఇవే కాక కోలాటం కార్యక్రమం, తీన్మార్ డాన్స్, వేల్పుల వీధి నృత్య ప్రదర్శన. పాత శారదా బ్రిడ్జి నుండి చిన్న నాలుగు రోడ్లు జంక్షన్ రామచంద్ర థియేటర్ నుండి పూడిమడక రోడ్డు రామాలయం వరకు భారీ స్టేజ్ ప్రోగ్రాములను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే రాత్రి రెండు గంటలకు వెలిగించే బాణాసంచా కార్యక్రమం సుమారు గంటపాటు ప్రత్యేక ఆకర్షనీయముగా ఉంటుందన్నారు. జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు. గౌరీ పరమేశ్వరుల పుట్టుక ఆలయ చరిత్ర.. సుమారు 170 సంవత్సరాల క్రితం స్థానిక వేల్పుల వీధిలో వేల్పుల అప్పల కుమార్తెలు అయినా ఇరువురు బాలికలు ఆజమా గౌరమ్మ ఇరువురు ఆటలు ఆడుకుంటూ తన తోటి పిల్లలతో తాటాకు పందిరిలు వేసి బాలగైరమైన చిన్న బొమ్మ పెట్టి తన తోటి పిల్లలతో ఆటలాడుతూ పూజలు చేస్తూ ఉండేవారు తదుపరి అదే ఖాళీ స్థలంలో వేల్పుల కుటుంబీకులు కార్తీక మాసంలో మట్టి బొమ్మ పెట్టి 11 రోజులు పిల్లలతో పూజలు చేయించి వారు ఇలా ఆనవాయితీగా జరుగుతూ వీధిలో ప్రజలందరూ కొలిచేవారు అలా కొంతకాలమునకు వేల్పుల వీధి పెద్దలు అందరూ కలిసి ప్రతి సంవత్సరం పందిరి వేయడం నెలరోజులు పూజించడం భాజా భజంత్రీలతో బొమ్మలాటలతో అనిపియటం ఇలా ఒక ఉత్సవ రూపం కల్పించి ఊరు పండుగల సాగేది కొంత కాలం నాకు నాటి ప్రముఖ వైద్యులు సామాజికవేత్త వేల్పుల వీధి వార్డుపై పోటీ చేసి గెలిచిన కౌన్సిలర్ డాక్టర్ కొమ్మ నర్సింగరావు నాయుడు తన భార్య కొమ్మ పార్వతమ్మ పేరున 1923వ సంవత్సరంలో పక్కా గుడిని నిర్మించి వేల్పుల వీధి ప్రజలకు అప్పగించారు. నాటి నుంచి పెద్దల కృషితో ఈ ఉత్సవం అఖండ ఖ్యాతి చెందింది. తదుపరి శిధిలావస్థకు చేరుకున్న గుడిని స్థానిక వేల్పుల వీధి ప్రజల ఆర్థిక సహాయంతో సమిష్టిగా ఒక సుందర ఆలయం నూతనంగా 2022 సంవత్సరంలో నిర్మాణమైంది.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :