Rapid TV - Andhra Pradesh / Anakapally : చోడవరం నియోజకవర్గం రావికమతం : మండలంలోని గుడివాడ గ్రామంలో శుక్రవారం ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి చోడవరం శాసనసభ్యులు కే.ఎస్.ఎన్.ఎస్. రాజు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నివేదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులు ఆంజనేయ స్వామి మాల ధరించి భక్తిశ్రద్ధలతో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం శుభ సూచకమని హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు మన దేశంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని ప్రపంచంలో ఎక్కడా కూడా లేనటువంటి ఆధ్యాత్మిక శోభ భారతదేశానికి దక్కుతుందని అన్నారు. ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యులైనటువంటి భక్తులకు గ్రామ ప్రజలకు కూటమినేతలకు మాలాధారణ చేసినటువంటి భక్తులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన కొండ నాయుడు మండల పార్టీ అధ్యక్షులు కోమటి శంకరరావు మండల జనసేన పార్టీ అధ్యక్షులు మైచర్ల నాయుడు మాస్టారు బాబూరావు, దేముల్లు గ్రామస్తులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Rapid TV