Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి రావికమతం :: మండలంలో మట్టవానిపాలెం గ్రామానికి చెందిన రాపర్తి శీను 30 అనకాపల్లి మండలం రామాపురం వద్ద అనుమానాస్పదలో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. అనకాపల్లి నుంచి ఇంటికి తిరిగి వస్తారని ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకు రామాపురం వద్ద రాత్రి రోడ్డు పక్కన శీను మృతిచెంది ఉన్నారని సమాచారం అందింది. భార్య అనిత కన్నీరు మున్నూరు అవుతుంది. మూడేళ్ల పాప మానశ్రీ, ఆరు నెలల బాబు గ్రేష్మంత ను ఏ విధంగా పోషించాలని భవిష్యత్తు తలుచుకుని రోధిస్తుంది. అనకాపల్లి రూరల్ ఎస్సై రవికుమార్ సంఘటనా స్థలం చేరుకొని మృతదేహాన్ని ఎన్టీఆర్ హాస్పిటల్ తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Rapid TV