Monday, 14 September 2026 04:39:17 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు.... ఎక్కడంటే

Date : 19 July 2024 02:46 PM Views : 195

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన సంఘం ప్రతిష్టా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జూలై 20వ తేదీ ఆషాడ పౌర్ణమి సందర్భంగా స్థానిక కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగనున్నాయని ప్రతిష్టా శతజయంతి ఉత్సవాల చైర్మన్ కోరుకొండ బుచ్చిరాజు, కో చైర్మన్ డాక్టర్ గ్రంధి శేషు కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. శనివారం ఉదయం ఐదున్నర గంటల నుండి నగర సంకీర్తనతో అమ్మవారికి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని అన్నారు. ఉదయం7 గంటలకు గోపూజ, 7: 30 గంటలకు కన్య అర్చన, 49 కలశములతో స్నపనము, అమ్మవారికి అభిషేకము, 9.30 గంటలకు కన్య మూలమంత్ర హోమములు కసింకోట వాస్తవ్యులు, ఆగమ పండిత్, అర్చక ఎగ్జామినర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అవార్డు గ్రహీత శ్రీమాన్ శ్రీ రేజేటి రామాచార్యులు వారి ఆధ్వర్యంలో జరుగునని తెలియజేశారు. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి 6 గంటల వరకు నారాయణీయం అంత్యాక్షరిలో గిన్నిస్ బుక్ ఆఫ్ అవార్డు గ్రహీత కాకినాడ వాస్తవ్యులు శ్రీమతి గ్రంధి తాయారు గారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం చే "నారాయణీయము" పారాయణ జరగనుందని తెలియజేశారు. అనంతరం ఆమెచే నారాయణీయం గ్రంథం విశిష్టత వివరించబడునని అన్నారు. కన్య అర్చనలో, కన్య మూల మంత్ర హోమంలో పాల్గొనేవారు డాక్టర్ జి. శేషు కుమార్ 9848313203, జీ వి వి ఎస్ మాణిక్యం 9848212531, ఉప్పల శ్రీనివాసరావు 9849836936 వారిని సంప్రదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బిల్లపాటి కృష్ణకుమార్, కార్యదర్శి కొరుపోలు జగదీశ్వరరావు, కోశాధికారి శ్రీధరాల సోమరాజు, ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :