Rapid TV - Andhra Pradesh / Anakapally : శిభిరంమండలంలోని చీమలపాడు పంచాయతీ గిరిజన గ్రామం ములకలాపల్లి గ్రామం లో సంజీవని వైద్యలు గంటి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఆదివారం ఉదయం జరిగింది. వైద్య శిభిరానికి 80మంది రోగులు హాజరై జ్వరం కీళ్ల, తదితర వ్యాదులకు వైద్య శిభిరం లో వైద్య సేవలు పొందారు. కొన్ని దీర్ఘ కలిక రోగులను మెరుగైన వైద్య సేవలకు నర్సీపట్నం ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రికి గానీ లేదా కేజీహెచ్ కు గాని వెళ్లాలని సూచించారు. రోగులందరికీ బిపి షుగర్ పరీక్షలు నిర్వహించి. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు కళ్ళ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న పలువురికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కంటి వైద్య శిబిరాలకు వెళ్లి ఉచితంగా చికిత్సలు చేయించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పెద్ద బోండా రాములు ఆకృతి సంస్థ కార్యదర్శి రవి ప్రసాద్ తదితరులు హాజరయ్యారు
Admin
Rapid TV