Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ అనకాపల్లి:: అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఎస్పీ తూహిన్ సిన్హా మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో విమాడుగుల & కొత్తకోట పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు వేరువేరు ఘటనల్లో 21,70,000 విలువచేసే 448 కేజీల గంజాయి, రెండు కేజీల లిక్విడ్ గంజాయి సీజ్ చేసీ, ఏడుగురు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి తుని మీదగా కేరళ రాష్ట్రానికి గంజాయి సరఫరా అవుతున్నట్టు గుర్తించి పోలీసులు నిఘా పెట్టినట్టు తెలియజేశారు. నిందితుల్లో ఐదుగురు కేరళకు చెందినవారు కాగా, ఒకరు చింతపల్లి కి చెందిన వారిని అన్నారు. నిందితుల నుండి ఒక లారీ ఒక బొలెరో, ఒక కారు, ఒక పల్సర్ బైక్ ఐదు సెల్ ఫోన్లు ఎనిమిది వేల నగదు సీజ్ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని ఇందులో ఇంకా ఎవరెవరు పాత్ర ఉందో విచారణ జరిపి వారిని కూడా అరెస్టు చేయడం జరుగుతుందన్న జిల్లా ఎస్పీ తూహీన్ సిన్హా తెలియజేశారు కేసును పట్టుకున్న పోలీసులకు ఎస్పి అవార్డులను అందించారు
Admin
Rapid TV