Saturday, 12 September 2026 08:04:22 PM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద ఆందోళన

Date : 29 April 2025 04:47 PM Views : 402

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ, అనకాపల్లి:: కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలపై కలెక్టరేట్ వద్ద ఆందోళన -సిఐటియు మద్దతు వైద్య ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్ మిషన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (సి హెచ్ ఓ)ల సమస్యలు పరిష్కారానికి మంగళవారం అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం ఆరు సంవత్సరాలు దాటిన ప్రతి సిహెచ్ఓ లను క్రమబద్ధీకరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్ హెచ్ ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ చేయాలని, ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్, పని ఆధారత ప్రోత్సాహకాలు, ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలని, ఎఫ్ఆర్ఎస్ నుండి సిహెచ్ఓల ని మినహాయించాలని తదితరు డిమాండ్లపై ఈ ఆందోళన నిర్వహించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 28వ తేదీ నుంచి సమ్మె నిర్వహిస్తున్న సిహెచ్ ఓ లు ఈరోజు అనకాపల్లిలో ఈ ఆందోళన నిర్వహించడం జరిగింది. జిల్లాలోని 45 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న సిహెచ్వోలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా కోశాధికారి, ఏపీ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ వి.వి. శ్రీనివాసరావు సంపూర్ణ మద్దతును తెలియజేసి సిహెచ్ ఓ ల న్యాయమైన సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, ప్రభుత్వాలు తక్షణమే డిమాండ్లు పరిష్కారానికి చర్చలు జరిపి ప్రజా సేవలు పునరుద్ధరించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం డిఆర్ఓ వెంకట రమణ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ ఓ లు జి భవాని, పి రేవతి, జి యమునా, కె అశ్విని, టి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :