Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ యలమంచిలి.. అనకాపల్లి జిల్లా, యలమంచిలి నియోజకవర్గం, అచ్యుతాపురం, అచ్యుతాపురం కస్తూరిబాయ్ స్కూల్లో నూతనముగా నిర్మించిన భవనాన్ని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు. భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కస్తూరిబాయి భవనాన్ని ఎకోమ్మా కంపెనీ వారి సి ఎస్ ఆర్ ఫండ్స్ తో నిర్మించడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్క కంపెనీ నియోజవర్గ అభివృద్ధికి సహాయ సహకార అందిస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి కంపెనీ వారు అందిస్తున్న సహాయ సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు .
Reporter
Rapid TV