Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV నర్సీపట్నం : నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన ప్రత్యేక కృషితో రోడ్లు భవనాల శాఖ నాబార్డ్ గ్రాంట్ నిధుల క్రింద రూ.5.30 కోట్ల విలువైన ఆరు రోడ్ల పనులకు అనుమతి మంజూరు అయింది. ఈ రోడ్ల అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత నర్సీపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. ఈ ఆరు కొత్త పనులతో కలిపి పది నెలల కాలంలో నియోజకవర్గానికి రూ.117 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకురావడంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు విజయం సాధించారు.
Reporter
Rapid TV