Saturday, 12 September 2026 01:52:34 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

ప్రతి కార్యకర్తకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ,

Date : 24 October 2024 07:46 PM Views : 271

Rapid TV - Andhra Pradesh / Anakapally : టిడిపి పార్టీ ప్రతి కార్యకర్తకు విద్యా వైద్యరంగంలో అండగా ఉంటుంది - ప్రగడ నాగేశ్వరరావు యలమంచిలి, న్యూస్ : యలమంచిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యలమంచిలి మండలం, యలమంచిలి మున్సిపాలిటీ, రాంబిల్లి మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. గురువారం యలమంచిలి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంట్ సభ్యులు పప్పల చలపతిరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి యలమంచిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోటాని, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు ఈనెల 26వ తేదీన ప్రారంభమవుతుందని, ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ సభ్యత్ నమోదులో పాల్గొని అన్నారు. అత్యధిక సభ్యత నమోదు చేయించాలని, ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ అండదండలుగా ఉంటుందని, సభ్యత్వం తీసుకున్న కార్యకర్త ప్రమాదవశాత్తు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారని, సాధారణ మరణం చెందిన కార్యకర్తకు మట్టి ఖర్చుల కింద పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారని, ప్రతి కార్యకర్తకు విద్యా వైద్యరంగంలో అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం పప్పల చలపతిరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఐకమత్యంతో పనిచేసి సభ్యత నమోదును విజయవంతం చేయాలని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సభ్యత నమోదు జరుగుతుందని, కావున సంక్షేమ ఫలాలను, సభ్యత నమోదును ప్రజలలోకి తీసుకెళ్లి వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ధూళి రంగనాయకులు, మండల అధ్యక్షులు ఇత్తంశెట్టి రాజు, గొర్లి నానాజీ, వసంతవాడ దిన్ బాబు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రాజాన సూర్య నాగేశ్వరరావు, కాండ్రకోట చిరంజీవి, సేనాపతి నాగేశ్వరరావు, గున్నా బత్తుల నాగేశ్వరరావు, కొటారు సాంబ, ఆడారి ఆదిమూర్తి, కర్రి శివ, చెల్లూరు దేవుడు, లాలం తాతబాబు, భూపతి రాజు రవిరాజు, మజ్జి రామకృష్ణ క్లస్టర్ ఇన్చార్జులు, యూనిట్ ఇన్చార్జులు, వార్డు ఇన్చార్జులు, గ్రామ శాఖ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :