Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ అనకాపల్లి:: అనకాపల్లి పట్టణంలో ల్యాండ్ పూలింగ్ లో 78 మంది రైతులకు న్యాయం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ గారు మాట్లాడుతూ అనకాపల్లి పట్టణంలో అనకాపల్లి సబ్బవరం రోడ్డులోని గోపాలకృష్ణ థియేటర్ వద్ద 2007లో ల్యాండ్ పూలింగ్ ను నిర్వహించి దానిని అర్ధాంతరంగా ఆపివేయడం జరిగిందని కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం దీనికి సంబంధించి మాజీ మంత్రివర్యులు శ్రీ దాడి వీరభద్ర రావు గారు మరియు దాడి రత్నాకర్ గారు 78 మంది రైతులతో ఒక వినతి పత్రాన్ని జనవరి నెలలో శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి అందజేయడం జరిగిందన్నారు. 2007లోనే రైతులందరికీ జిపిఏ రూపంలో సుమారు 43 ఎకరాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అనకాపల్లి రైతుల అందరి తరపున రైతు సంఘం ఆధ్వర్యంలో దాడి వీరభద్ర రావు గారు మరియు రైతుల సమక్షంలో జిపిఏలు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని అన్నారు. ఆ సమయంలో రోడ్లు మరియు కాలువలను కూడా కోటి 84 లక్షల రూపాయలను ప్రభుత్వం దానిమీద వెచ్చించడం జరిగిందన్నారు. ఆ తరువాత ఐఏఎస్ అధికారి కోటేశ్వరరావు గారు 2019లో ఆదేశాలిచ్చి ఈ పనులన్నింటిని ఆపవేయడం జరిగిందన్నారు. అప్పటినుండి ఈ అభివృద్ధి పనులన్నీ నిలిపివేయబడింది అన్నారు. కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు రాష్ట్ర క్యాబినెట్లో తీర్మానం చేసిన అనంతరం జూలై 30వ తారీఖున జీవో నెంబర్ 145 ను విడుదల చేయడం జరిగిందన్నారు. దీనిలో కూడా ప్రత్యేకంగా అనకాపల్లి చెర్లోపల్లి ఖండంలో ఉండే భూమి 58 ఎకరాల 18 సెంట్లు సంబంధించినంతవరకు ఈ జీవోను విడుదల చేయడం జరిగిందన్నారు. దీనిలో ప్రధానంగా ల్యాండ్ పూలింగ్ 2007లో చేపట్టబడిందో ఆ ప్రక్రియను మరల కొనసాగించవలసిందిగా, ఆరోజు చేసుకున్నా అగ్రిమెంట్లలోని నియమాల ప్రకారం భూములు ఇచ్చినటువంటి రైతులకు ఒక్కో ఎకరానికి ఇచ్చిన రైతుకు ఎకరాకు అభివృద్ధి చేసిన 1600 గజాలు రెసిడెన్షియల్ ఏరియా ఇవ్వడానికి, 200 గజాలు కమర్షియల్ ఏరియా ఇవ్వడానికి ఈ జీవోలో స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. అంటే ఓక్కో రైతుకి 1800 గజాలు పూర్తిగా అభివృద్ధి చేసిన తర్వాత ఆ భూమిని ఆ రైతుకి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది మరియు ఆ రైతు పూర్తి సర్వహక్కులను కల్పించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఆరోజు ఈ 43 ఎకరాలు కాకుండా సుమారు 15 ఎకరాల 90 సెంట్లు భూమిని జిపిఏ చేయకుండా అధికారులు ఆపు చేయించడం జరిగిందన్నారు. ఈ రిజిస్ట్రేషన్ అవని రైతులకు కూడా ఆ భూమిని పూర్తిగా అభివృద్ధి చేసి అభివృద్ధి చెందిన లేఅవుట్ నుంచి రైతుకు ఒక్కో ఎకరానికి రెసిడెన్షియల్ ఏరియాలో వెయ్యి గజాలు, కమర్షియల్ ఏరియాలో 200 గజాలు మొత్తం 1200 గజాలు సర్వహక్కులతో వారికి ప్రభుత్వం మరలా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ విధంగా 78 మంది రైతులకు లాభం చేకూర్చే విధంగా న్యాయం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. దాడి వీరభద్ర రావు గారు మంత్రి నారాయణ గారిని ఎనిమిది పర్యాయాలు, విఎంఆర్డిఏ కమిషనర్, చైర్మన్ ప్రమోద్ గోపాల్ గారిని కూడా ప్రత్యేకంగా కలిసి ప్రభుత్వానికి నివేదించేలాగా చర్యలు చేపట్టారని వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విషయంపై స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారు ఈ విషయాన్ని పరిష్కరించమని ప్రభుత్వానికి సూచనలు చేసి ఉన్నారని వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. అధికారులు త్వరితగతిన పనులన్నీ పూర్తి చేసి ఆరు నెలల లోపే లేఔట్ అంతటినీ అభివృద్ధి చేసి రైతుల ఇబ్బంది పడకుండా రైతులకు జీవో ప్రకారం భూమిని వారికి అందజేయాలని కోరడమైనది. ఈ ప్రక్రియలో సహకరించినటువంటి వ్యవసాయదారుల సంఘం సభ్యులందరికీ, ప్రభుత్వం తరఫున మంత్రివర్గ సభ్యుల అందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. రైతులు కూడా ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టి సంయమనం పాటించినటువంటి అనకాపల్లి ప్రాంత రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగి అందరికీ లాభదాయకంగా ఉంటుందని తెలియజేశారు.
Admin
Rapid TV