Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ అనకాపల్లి... అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా, స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. పెండింగ్ లో ఉన్న కేసుల సీడీ ఫైళ్లను సమీక్షించి, వాటి పురోగతిని విశ్లేషించారు. అదేవిదంగా 2020 కి ముందు ఉన్న పాత కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. బొజ్జన్న కొండ దారి లో వాహనాలు క్రమబద్ధీకరణకు, వాహనాల నియంత్రణకు సిబ్బందిని నియమించాలనీ, మైన్స్, విజిలెన్స్ అధికారులుతో తరచూ క్వారీ లను, క్రషర్ లను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే, స్టేషన్లోని సీసీ టీవీ కెమెరాలు పర్యవేక్షించి పూర్తిగా పనిచేసేలా చూడాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, రోడ్డు ప్రమాదాలు, నేరాలకు ఆస్కారం ఉన్న ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించి, తమ స్వంత ప్రాంగణాల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చుకునేలా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. అనుమతిలేని బహిరంగ మద్యం సేవనాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, మద్యం తాగి వాహనాలు నడిపే వ్యక్తులపై ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. రౌడీ షీటర్లు, చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులను కౌన్సిలింగ్ చేయడంతో పాటు, వారి ప్రవర్తనపై నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు. దొంగతనాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు రాత్రి, పగలు గస్తీలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. అనంతరం, పోలీస్ స్టేషన్ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులు స్థానిక పోలీసులతో కలిసి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సైబర్ క్రైమ్స్, మహిళా హక్కులు, పోక్సో యాక్ట్, గుడ్ టచ్ - బ్యాడ్ టచ్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, రోడ్డు భద్రత నియమాలు వంటి అంశాలపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి.అశోక్ కుమార్, ఎస్సై జి.రవికుమార్, ఇతర పోలీసు సిబ్బంది హాజరుగా ఉన్నారు.
Admin
Rapid TV