Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి. చోడవరం రావికమతం : మండల కేంద్రం రావికమతంలో వెలసివున్న శ్రీ నూకాంబిక ఆలయం వద్ద త్రాగునీటి సదుపాయం లేక భక్తులు స్థానికులు, తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య ను గ్రామ పెద్దలు ,ప్రజలు యువకులు గొంప ఎంపీటీసీ గెంజి సూర్యనారాయణ దృష్టి కి తీసుకెళ్లగా ఎంపీటీసీ గ్రాంట్ నుంచి చేతి బోరు మాంజురు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్డీఏ కూటమి నేతలతో కలిపి ఆయన భూమి పూజ కార్యక్రమాలను చేసి చేతి పంపు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు వర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ వెపాడ నాగేశ్వరరావు, తెలుగు యువత అధ్యక్షులు ఉప్పులూరి నాగేశ్వర్రావు, జి. ఈశ్వరరావు, పులిగాయల సత్యనారాయణ కూటమి నాయకులు సూరిబాబు, నెట్ శ్రీను, రామసూరి అప్పల నాయుడు భూషనం మరియు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొనడం జరిగింది.
Admin
Rapid TV