Rapid TV - Andhra Pradesh / Anakapally : నర్సీపట్నం, RAPID TV : నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా షేక్ గఫూర్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ పట్టణ సీఐ గా ఉన్న జి గోవిందరావు ఆయనకు బాధ్యతలు అప్పగించారు . నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ గఫూర్ కు పట్టణ ఎస్సైలు జి ఉమామహేశ్వరరావు, జే రమేష్, పట్టణ పోలీస్ సిబ్బంది సాదర స్వాగతం పలికారు. అనకాపల్లి ఎస్పీ కార్యాలయం నుండి ఇక్కడకు బదిలీపై వచ్చిన సీఐ గఫూర్ గతంలో నర్సీపట్నం రూరల్ సిఐ గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు సాయశక్తులా కృషి చేస్తానని అన్నారు.
Reporter
Rapid TV