Rapid TV - Andhra Pradesh / Anakapally : చోడవరం రాపిడ్ టీవీ:: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం తట్ట బంధ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయపడుతుందని నర్సీపట్నం విద్యుత్ శాఖ ఈఈ రామ కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సబ్ స్టేషన్ పరిధిలో సాంకేతిక పరమైనటువంటి మరమ్మతులు ఉన్నందున వాటిని నివృత్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వినియోగదారులు సహకరించాలని తెలిపారు
Admin
Rapid TV