Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : రాపిడ్ టీవీ అరకు : పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే స్వచ్ఛ సంకల్పం ఫోస్టర్ ను సినీ హీరో వెంకటేష్ ఆవిష్క రించారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం కు సంబంధించిన స్వచ్ఛ సంకల్పం ఫోస్టర్ ను సినీ అగ్ర హీరో వెంకటేష్ శుక్రవారం అరకులోయలో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో వెంకటేష్ మాట్లాడుతూ గంజాయి వంటి మాదకద్రవ్యాల నివారణకు మరియు ప్రజలకు వాటి వలన కలిగే దుష్ట్ర ప్రయోజనాల నుండి రక్షించుటకు అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. అలాగే యువత క్రమశిక్షణతో ఉండి బంగారు భవిష్యత్తును పొందాలన్నారు. ప్రజలు గంజాయి జోలికి పోవద్దని, జీవితాలను జైలు పాలు చేసుకోవద్దని, బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని హితవు పలికారు. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలను పోలీస్ శాఖ మరిన్ని చేపట్టాలని, తమ వంతు సహకారం అన్నివేళలా అందిస్తామని తెలిపారు.
Reporter
Rapid TV