Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన నాయకుడు కొణతాల రామకృష్ణ.. 2024 మే నెలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి జనసేన పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భారీ మెజార్టీతో గెలుపొందారు. తమ సమీప అభ్యర్థి వైఎస్ఆర్సిపి నుంచి పోటీ చేసిన మలసాల భరత్ కుమార్ పై 64429 ఓట్ల తేడాతో గెలుపొందారు. పవన్ కళ్యాణ్ పై ఉన్న నమ్మకంతోనే ప్రజలు తనకు పట్టం కట్టారని తనను గెలిపించిన అనకాపల్లి ప్రజలకు కొణతాల రామకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు
Admin
Rapid TV