Rapid TV - Andhra Pradesh / Anakapally : కల్తీ మద్యంతో మహిళల మాంగల్యాలు తెంచేస్తున్న జగన్ రెడ్డి జగన్ రెడ్డి ఆసరా పేరుతో అక్క చెల్లెమ్మలకు టోకర పెట్టాడు అని మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు.రాష్ట్రంలో 1కోటి 14లక్షల మంది డ్వాక్రా మహిళలుంటే 79లక్షల మందికే ఆసరా డబ్బులు వేసి 34లక్షల మంది డ్వాక్రా మహిళలకు టోకరా పెట్టాడని మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. మహిళల పై కక్షతోనే డ్వాక్రా నిర్వీరం చేశారని, శ్రీనిధి, ఉన్నతి రద్దు చేశారని, ఎన్టీఆర్ బేబీ కిట్లు, తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్, దీపం పథకాలు నాశనం చేశారని, బాలింతలకు 5000 నిలిపివేశారని ఆరోపించారు. కల్తీ మద్యం అమ్ముతూ రాష్ట్రంలో వేలాది మహిళల మాంగల్యలను జగన్ రెడ్డి తెంచేస్తున్నాడాని ఆరోపించారు.జీతాలు పెంచమనివేడుకున్న అంగన్వాడీలపై కక్ష కట్టి ఉక్కు పాదం మోపాడని, ఆసరా కింద మహిళలను ఉద్ధరిస్తామనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.ఈ రోజు అనకాపల్లి పట్టణం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రీ వ్యాప్తంగా పొదుపు సంఘాలు పెట్టి డ్వాక్రా వ్యవస్థను ప్రతిష్ట చేస్తే దాన్ని కూకటీ వేళ్ళతో పెకిలించి వేస్తున్న జగన్ రెడ్డి ఆసరా పేరుతో తానేదో పొదుపు సంఘాలను ఉద్ధరిస్తున్నట్లుగా మాట్లాడడం దెయ్యాల వేదాలు వల్లించిన చందంగా ఉందని అన్నారు.గత ఎన్నికల్లో అందరికీ డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మహిళలు ఓట్లు దండుకొని తరువాత 2019 ఏప్రిల్ 11 నాటికి ఉన్నవారికి మాత్రమే మాఫీ చేస్తున్నానని ప్రకటన చేసి మహిళలను మోసం చేశాడని అన్నారు.అలాగే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళలకు 0 వడ్డీ 5 లక్షల వరకు ఇవ్వడం జరిగిందని, పొదుపు సంఘం లో సభ్యులుగా ఉన్నవారు ప్రతి ఒక్కరికి పదివేల రూపాయలు ఇచ్చారని, జగన్ రెడ్డి మహిళలు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలలో కేవలం 3 లక్షలకు మాత్రమే వడ్డీ రాయితీ ఇస్తున్నారని అన్నారు.మూడు లక్షల కి కూడా 0 వడ్డీ కేంద్రమే భరిస్తుంది తప్ప, జగన్ రెడ్డి ఇచ్చేది ఏమీ లేదని, సభలలో డబ్బాలు కట్టుకోవడం తప్ప మహిళలను ఆర్థికంగా ఆదుకునేది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. వృద్ధాప్యంలో ఆదుకుంటాయని డ్వాక్రా మహిళలు దాచుకున్న ₹ 2118 కోట్ల అభయహస్తం నిధులు దారి మళ్లించి వారిని నిండా ముంచారని ఇదేనా మహిళా సంక్షేమం అని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని పక్కాగా అమలు చేసిందని, జగన్ రెడ్డి డ్వాక్రా మహిళలకు రుణమాఫీ జగన్నాటకమేనని అన్నారు.ఉన్నతి పథకంతో ఎస్సీ ఎస్టీ మహిళలకు చంద్రబాబు 800 కోట్లు ఇస్తే జగన్ రెడ్డి ఆ పథకాన్ని రద్దు చేసి వారికి మొండి చెయ్యి చూపారని, మద్యం నిషేధమని మహిళా ఓట్లు వేయించుకొని పిచ్చి మద్యంతో మాంగల్యాలు తెంచడమే మహిలోద్ధరణ? ఏ రకంగా చూసినా మహిళలను వైసిపి ప్రభుత్వం వంచనకు గురిచేసిందని, వారి ఆర్థిక పురోభివృద్ధికి ఆటంకాలు కల్పించారని ఆరోపించారు.
Admin
Rapid TV