Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కి అనకాపల్లిలో ఘన స్వాగతం లభించింది.. శుక్రవారం మొదటిసారి అనకాపల్లి వస్తున్న ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ కి స్వాగతం పలకడానికి జిల్లా ఏడు అసెంబ్లీ నియోజవర్గంలో ఉన్న జనసైనికులు టిడిపి బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. లంకెలపాలెం జంక్షన్ లో సీఎం రమేష్ కు భారీ గజమాలతో స్వాగతం పలికారు అనంతరం అక్కనుండి నుండి ర్యాలీ నిర్వహించారు. ముందుగా నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న సీఎం రమేష్ బైపాస్ రోడ్ నాగులపల్లి దారిలో ఏర్పాటుచేసిన సమావేశ కార్యాలయానికి చేరుకున్నారు.. అక్కడ నాయకులు కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లి సమగ్ర అభివృద్ధి తన ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన జనసేన టిడిపి బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
Rapid TV