Wednesday, 29 July 2026 01:32:39 AM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

రైతులు తమ పంటను డైరెక్ట్ గా (ఎఫ్ పి ఓ) అమ్ముకునే విధానం ద్వారా రైతులకు మేలు: జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్

Date : 19 July 2024 07:14 PM Views : 505

Rapid TV - Andhra Pradesh / Anakapally : రైతులు తమ పంటను డైరెక్టుగా (ఎఫ్ పి ఒ) అమ్ముకునే విధానం ద్వారా రైతులకు మేలు జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ అనకాపల్లి, జూలై 19: పండించే రైతులు తమ పంటను డైరెక్టుగా అమ్ముకునే విధానం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (farmer producer organization) డిస్ట్రిక్ట్ లెవెల్ మోనటరింగ్ ‌కమిటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో గల వివిధ రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులతో, రైతులు పండించే పంటలు, వాటి మార్కెటింగ్ అవకాశాలతో పాటు రైతు పండించిన పంటను స్టోరేజ్ చేసే అవకాశాలు గురించి చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు అధిక లాభాలు వచ్చే విధంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దళారీ వ్యవస్థ ద్వారా రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అవసరమైన అనుమతులు, సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో నాబార్డ్, హార్టికల్చర్, అగ్రికల్చర్, డిఆర్ డిఎ, ఫిషరీస్ శాఖల అధికారులు, ఎల్.డి.ఎమ్., వివిధ రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :