Sunday, 13 September 2026 03:21:18 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

అనకాపల్లి జిల్లా ఎస్పీ తూహీన్ సిన్హా ఐపీఎస్ మాకవరపాలెం పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ

Date : 14 May 2025 07:09 PM Views : 212

Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV, నర్సీపట్నం : అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని మాకవరపాలెం పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని శుభ్రత, నిర్వహణ, రికార్డుల సంరక్షణను సమీక్షించారు. అన్ని రికార్డులు సమయానికి నవీకరించాలనే సూచనలతో పాటు, నేర నివారణపై మరింత దృష్టి పెట్టాలన్నారు. స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంటున్న నేరాల స్వరూపం గురించి అధికారుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్న ఆయన నేర చరిత్ర గలవారి మరియు అనుమానితులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అవసరమైతే కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణాపై గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యార్థులకు, మహిళలకు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ మరియు మహిళా చట్టాలపై శక్తి యాప్ ప్రాముఖ్యతను తెలిపి ప్రతి ఒక్కరూ యాప్ ను డౌన్లోడ్ చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. రహదారి భద్రతా ప్రమాణాలు, సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటు అనేది నేర నియంత్రణలో కీలకమని, దీనిపై ప్రజలలో అవగాహన పెంచాలని స్పష్టం చేశారు.

తనిఖీ అనంతరం ఆయన పోలీసు సిబ్బందితో సమావేశమై , వారి సేవలను అభినందించి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సహాయాన్ని అందించేందుకు తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ తనిఖీ సందర్భంగా నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి ఎల్.రేవతమ్మ, తదితరులు ఎస్పీ వెంట ఉన్నారు.

PALLA GOVINDARAO

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :