Rapid TV - Andhra Pradesh / Anakapally : ఘనంగా టిడిపి సీనియర్ నాయకులు లాలం భాస్కరరావు జయంతి వేడుకలు టిడిపి సీనియర్ నాయకులు లాలం భాస్కరరావు జయంతి వేడుకలు టిడిపి కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు టిడిపి కార్యకర్తలు అభిమానులు మధ్యలో కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు లాలం భాస్కరరావు మన మధ్య లేనప్పటికీ ఆయనను ఎప్పుడూ టిడిపి పార్టీ గుర్తు ఉంచుకుంటుందని అన్నారు లాలం భాస్కర్ రావు అంటే ఒక నియోజకవర్గానికి కాదు జిల్లా మొత్తానికి కూడా ఆయన సుపరిచితులు అని ఉమ్మడి విశాఖ జిల్లాలో తనదైన శైలిలో రాజకీయ గుర్తింపు పొందిన ఏకైక నాయకుడని ఆయనకు జిల్లాలోనే కాకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా లాలం భాస్కర్ అంటే తెలియలేని నాయకులు అంటూ ఎవరూ లేరని అన్నారు అదేవిధంగా లాలం భాస్కరరావు జయంతి వేడుకలు పురస్కరించుకొని లాలంకోడూరు అభిమానులు అచ్యుతాపురం మండలం కొండకర్ల దగ్గర ఉన్న ఇచ్చా ఫౌండేషన్ లో అనాధ పిల్లల మధ్యలో కేక్ కటింగ్ చేసి పిల్లలకు భోజనం కార్యక్రమాన్ని చేశారు ఈ కార్యక్రమంలోలాలం చందు అభిమానులు, మరియు చీపురుపల్లి తాతాజీ,లాలం గణేష్, నరేష్, పాల్గొన్నారు
Reporter
Rapid TV