Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం జి కొత్తపల్లి గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చోడవరం సామాజిక అటవీ పరిధి అధికారి బి గౌరేష్, సిబ్బంది ఆధ్వర్యంలో కస్తూరిబా గాంధీ విద్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రేంజ్ అధికారి బి గౌరేష్ మాట్లాడుతూ. ప్రపంచ పర్యావరణ దినోత్సవ పురస్కరించుకొని అనకాపల్లి డివిజనల్ ఫారెస్ట్ అధికారి గంపా లక్ష్మణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పకృతికి రక్షణ కరువైనందున ఐక్యరాజ్యసమితి జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరపాలని నిర్ణయించిందని కావున ప్రతి ఒక్కరూ ఒక సంవత్సరంలోఅనీసం ఒక మొక్క నాటి పర్యావరణ సమతుల్యతను, భూ మాతను కాపాడాలని సూచించారు, ఈ సందర్భంగా నేడు నిచ్చే చెట్లను పండ్ల జాతి మొక్కలను సుమారు వంద మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జి కొత్తపల్లి గ్రామ కస్తూర్బా బాలికల గాంధీ విద్యాలయ ప్రిన్సిపాల్ వి భారతి వారి సిబ్బందికి మరియు చోడవరం ఎస్ఎఫ్ సెక్షన్ ఆఫీసర్ జే రమణ రావికమతం సెక్షన్ ఆఫీసర్ ఓ ఎస్ యన్ మూర్తి జైతవరం వన సేవకు రమణ విద్యాలయ సిబ్బంది తదితరులు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు
Admin
Rapid TV