Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి: చోడవరం నియోజకవర్గంలోని రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడం వల్ల అధికారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని చోడవరం కోర్ట్ సీనియర్ న్యాయవాదులు కాండ్రేగుల డేవిడ్, భూపతి రాజు, ఎబి భూషణ్ చోడవరం కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. సంబంధిత అధికారులకు ఈనెల 26వ తేదీన కోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీ ఈ విషయమై న్యాయవాదులు విలేకరులతో మాట్లాడుతూ అత్యవసర సర్వీసులైన ఫైర్ పోలీస్ 108 అంబులెన్సులు వివిధ పనులపై వెళ్తున్న ప్రజలకు రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నర్సీపట్నం భీమునిపట్నం రోడ్డు మరి అధ్వానంగా ఉందని రోలుగుంట రావికమతం బుచ్చయ్యపేట వడ్డాది చోడవరం అనకాపల్లి వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉన్నాయని గత 20 సంవత్సరాలుగా ఈ రోడ్లు పరిస్థితి ఇదే విధంగా ఉందని ప్రస్తుతం మరి అధ్వానంగా ఉండడంతో కోర్టుకు తెలియపరిచామని అన్నారు.
Admin
Rapid TV